హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తోంది. వయసు పైబడిపోతున్నా ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణమెవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్. అవును, ఈ మాట అంటోంది మరెవరో కాదు టబునే.. ఆమె గతంలో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. అజయ్ దేవ్‌గణ్ తనకు సహనటుడు మాత్రమే కాదని, చిన్నప్పటి నుంచే తెలుసని చెప్పింది. 13 -14 ఏళ్ల వయసులోనే ఒకరికొకరం తెలుసంది. అజయ్ తన సోదరుడి స్నేహితుడేనని, తామంతా జుహులోనే కలిసి పెరిగామని పేర్కొంది. తనెక్కడికి వెళ్లినా అజయ్ తనను ఫాలో అయేవాడని చెప్పుకొచ్చింది.
నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే అజయ్ అస్సలు సహించేవాడు కాదని, వాళ్లను కొట్టడానికైనా సిద్ధపడేవాడని తెలిపింది టబు. అంతేకాకుండా తనను ఓ కంట కనిపెడుతూ ఎప్పుడు? ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకుని వెనకాలే వచ్చేవాడంది. అతడి వల్లే తానిప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి బాధ్యుడైనందుకు సదరు హీరో పశ్చాత్తాపపడాలని చెప్పుకొచ్చింది. కాగా అజయ్, టబు ఇద్దరూ కలిసి ‘దృశ్యం’, ‘గోల్‌మాల్ అగెయిన్’, ‘విజయ్‌పథ్’, ‘హకీకత్’ సినిమాల్లో నటించారు. చివరిసారిగా ‘దేదే ప్యార్ దే’ చిత్రంలో వీళ్లిద్దరూ నటించారు.