అఖిల్ మి || మజ్ను ఫస్ట్ లుక్ అండ్ టీజర్ !

Mr.Majnu Akhil First look

ఇంకా టైటిల్ పెట్టని అఖిల్ మూడవ సినిమా రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మూడో సినిమా టైటిల్‌ను ఈరోజు ప్రకటించింది చిత్రయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను ఈరోజు రిలీజ్ చేసారు. ‘దేన్నైతే మిస్‌ చేయకూడదో.. దాన్నే మిస్‌ అన్నారు’ అంటూ సాగుతున్న ఈ టీజర్ మీద మీరూ ఒక లుక్ వెయ్యండి మరి,