వెబ్ సిరీస్ లో అఖిల్..

వెబ్ సిరీస్ లో అఖిల్..

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడటం తో లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. ఈ సమయం లో ప్రజలు ఎక్కువగా సమయం వెచ్చించినది ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ అని చెప్పాలి. వెబ్ సిరీస్ లకు విపరీతంగా డిమాండ్ పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు అన్ని కూడా దాదాపు ఆన్లైన్ ద్వారా నే విడుదల అవుతున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ల పై అఖిల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి కే అక్కినేని కుటుంబం నుండి సమంత ది ఫ్యామిలీ మాన్ 2 లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే తరహా లో బాలీవుడ్ లో ఒక క్రేజీ వెబ్ సిరీస్ లో నటించేందుకు అఖిల్ కి ఒక అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందులో రాక్ స్టార్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.