కుమారుడికి కరోనా…తండ్రి ఆత్మహత్య

కుమారుడికి కరోనా...తండ్రి ఆత్మహత్య

కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఓ తండ్రి తీవ్ర మనస్తాపం చెందాడు. గుండె చెదిరిన ఆ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. బాధితుడు మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.

తన కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కాల్వలోకి దూకడంతో కొట్టుకుపోతున్న నాగేశ్వరరావును ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు.ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.