పట్టుబట్టిన అక్కినేని వారసుడు

పట్టుబట్టిన అక్కినేని వారసుడు

అక్కినేని అఖిల్‍కి అనుకోకుండా సురేందర్‍ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్‍ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్‍ తన తదుపరి చిత్రానికి అఖిల్‍ని ఎంచుకున్నాడు. సురేందర్‍ చెప్పిన బడ్జెట్‍ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్‍ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్‍ తరహా యాక్షన్‍ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.

ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్‍ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్‍ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్‍ తోడవుతుందనేది అఖిల్‍ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్‍లో టాప్‍ హీరోయిన్లు. సూపర్‍స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్‍ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.