యాక్షన్ మోడ్‌లోకి మారడానికి అఖిల్ రెడీ అయ్యారు. ఫిబ్రవరి నుంచి యాక్షన్ షురూ అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ స్టయిలిష్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనుంది. ఇందులో భారీ మోతాదులో యాక్షన్ అంశాలు కూడా ఉంటాయట.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమా నిర్మించనున్నారు. ఇందులో అఖిల్‌కి జోడీగా ఎవరు నటిస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేక వర్కౌట్స్ కూడా చేస్తున్నారట అఖిల్. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఎక్కువ శాతం చిత్రీకరణ ఫారిన్‌లో ఉంటుందని తెలిసింది.