ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడా?

ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడా?

అ‍క్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అఖిల్ తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్‌ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్‌. గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.