తనలో ఉన్న సాడిస్ట్ ని బయటకి తెచ్చిన హిమజ

తనలో ఉన్న సాడిస్ట్ ని బయటకి తెచ్చిన హిమజ

పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో హిమజ తెగ ఆనంద పడుతోంది. పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్‌ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో ఎగిరిగంతేసింది. పునర్నవి ఎలిమినేట్‌ అయిందని నాగార్జున ప్రకటించడంతో హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేసింది.

ఇక దీనికి సంబంధించిన వీడియోను హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతేకాకుండా పునర్నవి యాక్షన్‌కు తన రియాక్షన్‌ ఇదే  నంటూ కామెంట్‌ జతచేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చిల్లర వేశాలంటూ పునర్నవి అభిమానులు హిమజపై మండిపడుతున్నారు. అంతేకాకుండా షోలో భాగంగా నాగార్జున షూ పాలీష్‌ చేసినప్పుడు, ఇంటి సభ్యుల బంధువులు హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా హిమజ ఇలాగే ఓవరాక్షన్‌ చేసిందని గుర్తుచేస్తున్నారు.

అయితే మరికొంత మంది మాత్రం హిమజకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో హిమజ-పునర్నవిల మధ్య ఎప్పుడూ ముఖ్యంగా నామినేషన్‌ సమయంలో యుద్ధ వాతావరణం ఉండే విషయం తెలిసిందే. ఇక హిమజ బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకి వచ్చాక ఇంటి సభ్యుల గురించి, హౌజ్‌ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.