కావాలని వితికని ఫోకస్ చేసి బ్యాడ్ చేస్తున్న బిగ్ బాస్

కావాలని వితికని ఫోకస్ చేసి బ్యాడ్ చేస్తున్న బిగ్ బాస్

బిగ్ బాస్ హౌస్‌లోకి భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా గేమ్‌ కోసం ఎలాంటి ఛాలెంజ్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతోంది. హౌస్‌లో ఆమె ఆటతీరు చూస్తుంటే ఎలాంటి పనికైనా వెనకడుకువేసే ప్రసక్తే లేదన్నుట్టుగానే వ్యవహరిస్తోంది. తాజాగా బాటిల్ ఆఫ్ ది మెడాలియన్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మెడల్‌ని సొంతం చేసుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.

ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియాలో ఒక రిక్షాపెట్టి ఇందులో ఎవరు ఎక్కువ సేపు ఉంటారో వాళ్లే విజేత అని బిగ్ బాస్ ఆదేశించడంతో పాటు వాళ్లను కిందికి దింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు బిగ్ బాస్. చివరికి రోజు మొత్తం అదే రిక్షాలో ఉన్న బాబా, వితికాలు మెడల్ కోసం తీవ్రంగా శ్రమించారు.

అయితే బాబా‌కి టాయిలెట్ అర్జెంట్ కావడంతో దప్పటి అడ్డుపెట్టుకుని పని కానివ్వడానికి ప్రయత్నిస్తుండగా.. వితికా ఒక సాటి అమ్మాయిగా తన అభిప్రాయం చెప్పింది, తన స్థానం లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే స్పందిస్తుంది.ఎప్పుడు అమ్మాయి ల  గురించి స్టాండ్ తీసుకుంటా అని పెద్ద పెద్ద మాటలు చెప్పే  శివ జ్యోతి,శ్రీ ముఖి  కూడా వితిక కి  సపోర్ట్ చేయకపోవడం బాదాకరం.పైగా బుద్ధి లేకుండా బాబా గారు చేసే పనిని సమర్దించారు.అదే స్థానం లో శ్రీ ముఖి, శివ జ్యోతి ఉంటే  ఇంకా ఎక్కువ రచ్చ చేసేవాళ్ళు. కాని బిగ్ బాస్ వాళ్ళని మాత్రం ఇంతగా టార్గెట్ చేసే వారు కాదు.

నాకూ టాయిలెట్ వస్తుంది అని వితిక చెప్పిన కూడా బాబా తన స్వార్థం తో తన పనిని చేయటానికి వెనుకాడలేదు. ఇది మాత్రం బిగ్ బాస్ మరియు ఇతర హౌస్ మేట్స్ కళ్ళకి కనిపించలేదు.అయితే ఇంకా బాధాకర విషయమేమిటంటే సగం సగం ఎపిసోడ్స్ చూసి బిగ్ బాస్ ఇచ్చే స్క్రిప్ట్ నాగార్జున కళ్ళకి  కూడా ఈ విషయం కనిపించలేదు. అదే స్థానం లో శ్రీ ముఖి ఉంటె నాగార్జున గారు కొంచెం కూడా శ్రీ ముఖి పేరు కి మచ్చ తెచ్చే వారు కాదు. ఎందుకంటే బిగ్ బాస్ నిర్వహించేవాళ్ళు శ్రీ ముఖి సన్నిహితులనే వార్తలు ఇది వరకే వచ్చాయి.

ఒక్క మొదటి వారం జరిగిన గొడవకి కావాలని దాన్నే అలుసుగా తీసుకొని బిగ్ బాస్ తనని ఇలా టార్గెట్ చేయడం చాలా చేయడం అన్యాయం.వితిక ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, తను ఏది అనిపిస్తే అది అనేస్తుంది.దాన్లో ఏమి తప్పు లేదు.తనని ప్రజల్లో కూడా బ్యాడ్ చేయాలనీ ఏదో రకంగా బిగ్ బాస్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు, చివరికి అలాగే జరుగుతుంది కుడా. మిగతా వాళ్ళు కూడా వెనుక మాటలు మాట్లాడటం చేసినప్పటికీ బిగ్ బాస్ వాళ్ళని ఫోకస్ చేయలేదు, నాగార్జున గారు వాటిని చూసి చూడనట్టు ఒదిలేసి కప్పిపుచ్చారు. శివ జ్యోతి ,రవి కూడా (వితిక, వరుణ్, రాహుల్, పునర్నవి) ల గురించి చాలా సార్లు తప్పుగా మాట్లాడుకోవటం జరిగింది కాని కెమెరాలు దాన్ని ఫోకస్ చేయలేదు.మొన్న కూడా మహేష్ విట్ట పునర్నవి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నారు.

ఇప్పటికైనా బిగ్ బాస్ ఒక్క మనిషిని టార్గెట్ చేయకుండా సరైనా విధంగా మిగతా అందరి క్లిప్పింగ్స్ కూడా  చూపిస్తారని ఆశిద్దాం. ఇప్పటినుంచైనా అందరి నిజ స్వరూపాలు బయట పెట్టాలని వేచి చూద్దాం.