పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తుంటాడు. అతడి లుక్స్, అతడి లివింగ్ స్టైల్‌తో అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాడు ఈ మెగా వారసుడు. తాజాగా అకీరా నందన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీలో అకీరా నందన్ పర్యటిస్తున్నాడు. అక్కడి గంగానదిపై అకీరా ఒక పడవలో కూర్చుని వెళుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అకీరా లుక్స్ మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
ఇక తనదైన ట్యాలెంట్‌తో అకీరా ఇప్పటికే అభిమానుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇంకా సినీ ఎంట్రీ ఇవ్వకపోయినా, హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ అభిమానులు అతడికి కితాబిస్తున్నారు