ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్న పలు భారీ మూవీ ల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సినిమా “ఓజి” కూడా ఒకటి. పవన్ అభిమానులు అయితే మొదట ఈ మూవీ కే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇక ఈ పర్టిక్యులర్ మూవీ లో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని టాక్ ఉంది.
మరి వీటిలో పవన్ వారసుడు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ కూడా ఉన్నాడని ఆ మధ్య వచ్చిన బజ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే ఈ మూవీ లో అకిరా ఉన్నాడా లేదా అనే ప్రెజెన్స్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పే సమాధానం ఇపుడు బాగా ఆసక్తిగా మారింది.
చరణ్ బాలయ్య క్రేజీ టాక్ షో అన్ స్టాప్పబుల్ సీజన్ 4 లో గెస్ట్ గా హాజరు కాగా అందులో పవన్ మూవీ లో అకిరా ఉన్నాడా లేదా అనేది తాను రివీల్ చేయనున్నారు . అయితే దీనిపై పాజిటివ్ సమాధానమే చరణ్ నుంచి ఉంటుంది అని ఇపుడు తెలుస్తుంది. మరి చరణ్ చెప్పిన సమాధానం ఏంటో తెలియాలి అంటే ఈ జనవరి 8 సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్ కి రానుంది .