Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఏమాయ చేశావే’ చిత్రంతో నాగచైతన్యను మరియు తెలుగు ప్రేక్షకులకులను మాయ చేసి మంత్రమేసిన సమంత అప్పటి నుండి నాగచైతన్యను తన వెంట తిప్పుకుంది, ప్రేక్షకులను తన వైపుకు మరల్చుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత సినీ జర్నీ మరియు పర్సనల్ జర్నీ అన్నీ కూడా సాఫీగా సాగుతూ ఉంది. సమంతపై ఎప్పటికప్పుడు అభిమానులు అభిమానం పెంచుకుంటూ వస్తూనే ఉన్నారు. సినిమా సినిమాకు ఆమెలోని ప్రతిభకు పదును పెడుతూ, అందంతో పాటు, అభినయంను కూడా చూపించి సినిమాల్లో మెప్పిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు ఏం చేసినా కూడా వివాదాస్పదం అవుతుంది. కారణం ఈ అమ్మడు వచ్చే నెలలో నాగచైత్యను వివాహం చేసుకోబోతుంది. అక్కినేని వారి ఇంటి కోడలు కానున్న నేపథ్యంలో ఈమె వివాదాల్లో ఇరుక్కుంటుంది.
అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది. ఆ గౌరవంను నిలపాల్సిన బాధ్యత సమంతపై ఉంది. కాని సమంత మాత్రం కొన్ని సార్లు తాను వేసుకునే కాస్ట్యూమ్స్‌తో అక్కినేని వారి పరువును గంగపాలు చేస్తుంది. నాగచైతన్యను ఇంకా పెళ్లి చేసుకోకపోయినా కూడా పెళ్లికి సిద్దం అయ్యింది కనుక సమంత ఇప్పుడు అక్కినేని వారి కోడలు అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆమె అక్కినేని వారి ఫ్యామిలీ గౌరవం దెబ్బ తినేలా ప్రవర్తించకూడదు.
గతంలో పలు సార్లు మరీ హాట్ డ్రస్‌లు వేసుకుని అందాలు ఆరబోసిన ముద్దుగుమ్మ సమంత తాజాగా మరోసారి ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం హాట్ ుక్స్‌తో అందాల ప్రదర్శణ చేసింది. ఈ అమ్మడు చేసిన ఆ ఫొటో షూట్ స్టిల్స్ కొన్ని మరీ దారుణంగా ఉన్నాయి. అక్కినేని వారి ఇంటి కోడలు ఇలా చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కొందరు సమంతను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. సమంత ప్రవర్తన మార్చుకోవాలని, పరువు తీసే పనులు మానుకోకుంటే అభిమానులు హద్దులు మీరే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరించారు. మరి ఇప్పటికి అయినా సమంత కాస్త పద్దతిగా డ్రస్సింగ్ అవుతుందేమో చూడాలి.