మరో సారి అక్కినేని కుటుంబం….

మరో సారి అక్కినేని కుటుంబం....

‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలసి నటించింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

అయితే అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్‌న గర్‌ టాక్‌. కుమారులు చైతన్య, అఖిల్‌తో కలసి ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట నాగార్జున. ఈ మల్టీస్టారర్‌ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తారట. గతంలో రాహుల్‌ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని చేశారు నాగార్జున. ఈ మల్టీస్టారర్‌ మూవీ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుందని టాక్‌.