‘ఎన్టీఆర్ 31’మూవీ లో అలియా భట్ ?

Alia Bhatt in 'NTR 31' movie?
Alia Bhatt in 'NTR 31' movie?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నది . ఐతే, తాజాగా ఈ మూవీ కి సంబంధించి మరో క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తోంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోందని తెలుస్తుంది . మరి, అలియా భట్ నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే.. ఆ క్రేజే నే వేరు. అలాగే, ఈ మూవీ లో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఆ పాత్రలో మరో స్టార్ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది .

Alia Bhatt in 'NTR 31' movie?
Alia Bhatt in ‘NTR 31’ movie?

మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో అనేది చూడాలి. మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ కథ పై, తారక్ సరసన నటించే హీరోయిన్ పై చాలా రకాల వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఆ మధ్య ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని అంటూ ఈ చిత్రబృందం ఒక మెసేజ్ ని కూడా పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ మూవీ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.