ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది

ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది

బాలీవుడ్​ తారలు వరుసగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ప్రేక్షకులకు, అభిమానులకు కనులవిందు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రేమ పక్షుల్లో​ అలియా భట్​, రణ్​బీర్​ కపూర్​ జంట ఒకటి. వీరిద్దరి వివాహం ఎప్పుడా అనే ప్రశ్న ప్రతీసారి వినిపిస్తూనే ఉంటుంది. ప్రతీసారి ఫలానా తేది అంటూ వార్తలు చక్కర్లూ కొడుతూనే ఉన్నాయి. ఇదే ప్రశ్నను అభిమానులుు, ఆడియెన్స్​, నెటిజన్లు అలియా, రణ్​బీర్​ను చాలాసార్లు అడిగారు. అయితే తాజాగా మరోసారి అలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది.

అలియా నటించిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అలియాను మీ పెళ్లెప్పుడు అని అడిగారు. దానికి అలియా ‘మీ పెళ్లెప్పుడూ అని పదే పదే అడుగుతున్నారు. దీని గురించి రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఇది ఎవరికీ సంబంధించిన విషయం కాదు. నా వ్యక్తిగతం. ఇక రెండోది ఏంటంటే పెళ్లి అనేది మనసుకు సంబంధించినది. రిలేషన్​షిప్​తో ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.

నా ఇష్టం, రణ్​బీర్​ ఇష్టాలకు అనుగుణంగా ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే మా వివాహం జరుగుతుంది.నిజం చెప్పాలంటే రణ్​బీర్​తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నా చిన్నతనంలోనే రణ్​బీర్​ను మొదటిసారి స్క్రీన్​పై చూసినప్పుడే అతణ్ని పెళ్లి చేసుకోవాలనిపించింది.’ అని తెలిపింది. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.