చుట్టమల్లే చుట్టేసింది అంటూ తన క్యూట్ వాయిస్‌తో ఆలియా పాట

Alia bhatt sings devara song
Alia bhatt sings devara song
ఎన్టీఆర్‌ను సిల్వర్ స్క్రీన్ మీద చూసి దాదాపు రెండేళ్లు దాటిపోయింది. దీంతో నందమూరి అభిమానులు దేవర రాక కోసం ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా దేవర సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో ఎన్టీఆర్ చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం ఆలియా తెలుగులో పాట పాడటం మరో విశేషం.
ఈ చిట్‌చాట్‌లో ఎన్టీఆర్ దేవర సినిమాను ప్రమోట్ చేయగా ఆలియా తన కొత్త సినిమా జిగ్రా విశేషాలు చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, ఆలియాను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ షో మొత్తంలో ఆలియా భట్ పాట పాడటం బాగా హైలెట్ అయింది. దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేసింది పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పాటను అది కూడా తెలుగులో ఆలియా భట్ పాడింది. చుట్టమల్లే చుట్టేసింది అంటూ తన క్యూట్ వాయిస్‌తో ఆలియా పాట పాడుతుంటే ఎన్టీఆర్ అలా చూస్తూ ఉండిపోయారు. పాట అయిపోగానే చెప్పానుగా తన టాలెంట్ గురించి అంటూ తారక్ కరణ్‌ జోహార్‌తో అన్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆలియా వాయిస్ ఏం క్యూట్ ఉందబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే ఆలియా ఇలా పాట పాడటం ఇది కొత్తేం కాదు. గతంలో ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో “కుంకుమలా నువ్వే” పాటను పలు షోల్లో ఆలియా ఆలపించింది. మొత్తానికి తన నటనతోనే కాకుండా సింగింగ్ టాలెంట్ కూడా చూపిస్తుంది ఆలియా.