ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో హిట్లు కొట్టిన అల్లరి నరేశ్ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. నరేశ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు.
ఇక చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చూడడంతో నరేశ్ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేశ్‌ఎమోషనల్ అయి కనీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు.‘2012 ఆగస్టులో ‘సుడిగాడు’ విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్ వేగేశ్న నమ్మి ప్రోత్సహించారు. సక్సెస్ అవుతుందో కాదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో అనే టెన్షన్ ఉండేది. కానీ ప్రేక్షకులు అవేవి పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్ చేసి మెచ్చుకుంటున్నారు’అని నరేశ్ ఎమోషల్ అయ్యారు. డైరెక్టర్ విజయ్ తనకు సెకండ్ బ్రేక్ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.