అల్లు అర్జున్- పూజ హెగ్దే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని వారి కుటుంబ సబ్యులకు చూపించాడట. అల్లు అరవింద్ కి ఒక సెంటిమెంట్ వుంది. వారి కుటుంబ సబ్యుల జడ్జిమెంట్ ని బాగా నమ్ముతాడట. వారి సిస్టర్స్ అభిప్రాయాన్ని కూడా అడిగి సినిమా ఎలా ఉందొ ఫిక్స్ అవుతారట. అయితే ఈ చిత్రాన్ని చూసిన కుటుంబ సభ్యులు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడమే కాకుండా, చూసిన ప్రతి ఒక్కరు సూపర్బ్ అని తేల్చేశారట.
ఇప్పటికే ఈ సినిమా పాటలు విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన రివ్యూ తో మరికొంత జోష్ లో వున్నారు చిత్ర బృందం. అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తీ చేసుకొని విడుదల కి సిద్ధం చేయనున్నారు. డీటీఎస్ మిక్సింగ్ కాకుండానే ఈ చిత్రంని ఓకే చేసారు అల్లు కుటుంబ సభ్యులు. అయితే వారిచ్చిన కాన్ఫిడెన్స్ సంక్రాంతి బరిలో నిలబెట్టడమే కాకా, సూపర్ హిట్ అవుతుందని అందరు భావిస్తున్నారు.