మహేష్‌తో ప్లాన్‌ చేస్తున్న మెగా నిర్మాత

allu aravind produce a movie with mahesh babu

అల్లు అరవింద్‌ గతంలో భారీ చిత్రాలను నిర్మించి స్టార్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. కాని ఈమద్య కాలంలో కేవలం మెగా హీరోలకు మాత్రమే అల్లు అరవింద్‌ పరిమితం అవుతున్నాడు. మెగా కాంపౌండ్‌ దాటని అల్లు అరవింద్‌ త్వరలోనే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో మూవీని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే ఒక కార్యక్రమంలో మహేష్‌బాబును కలిసిన సమయంలో ఒక సినిమా నిర్మించేందుకు డేట్లు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగిందని, తప్పకుండా మీ బ్యానర్‌లో సినిమా చేస్తాను అంటూ మహేష్‌బాబు హామీ ఇచ్చాడు అంటూ అల్లు అరవింద్‌ సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. మహేష్‌బాబు కోసం ఒక కథను సిద్దం చేయిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చాడు.

mahesh-babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం మూడు సినిమాలకు అప్పుడే డేట్లు ఇచ్చేశాడు. మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు మహేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను చిత్రం సీక్వెల్‌ చేసే యోచనలో కూడా ఉన్నాడు. ఇలా వరుసగా మూడు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అల్లు అరవింద్‌ నిర్మాణంలో సినిమా చేస్తాను అంటూ మహేష్‌ మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. 2020 వరకు మహేష్‌బాబుతో అల్లు అరవింద్‌ సినిమాను ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక చిన్న ప్రకటన కూడా విడుదల చేయాలని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడు. అయితే ఇంకా చాలా సమయం ఉంది కనుక ప్రకటన వద్దంటూ మహేష్‌బాబు సన్నిహితులు అల్లు అరవింద్‌తో అంటున్నట్లుగా తెలుస్తోంది.

mahesh-babu