అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలై చాలా నెలలు అవుతోంది. అయినా ఇప్పటి వరకు బన్నీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించినది లేదు. వరుస విజయాల తర్వాత ‘నా పేరు సూర్య’ చిత్రంతో ఫ్లాప్‌ను చవిచూసిన బన్నీ తన తదుపరి చిత్రానికి కాస్త వెనుక ముందు ఆలోచిస్తున్నాడు. తదుపరి చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం విడుదల అయిన కొన్ని వారాలకే తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక చిత్రాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. కాని ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని, ఇంకాస్త బెటర్‌గా స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా దర్శకుడు విక్రమ్ కుమార్‌కు బన్నీ సూచించాడు.
మూడు నాలుగు నెలలుగా బన్నీ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తూనే ఉన్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఇక తన వల్ల కాదని ప్రాజెక్ట్ డ్రాప్ చేసి వెళ్లి పోయాడు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ తదుపరి చిత్రం ఆలస్యం అవుతున్నందుకు క్షమించాలి, తప్పకుండా ఒక మంచి సినిమాతో వస్తాను, ఆలస్యం అయినా అద్బుతమైన సినిమా చేయాలనేది తన తాపత్రయం అని, తప్పకుండా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. బన్నీ మాటలు చూస్తుంటే ఇంకా చాలా టైం ఉన్నట్లుగా అనిపిస్తుంది. బన్నీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రం చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ త్వరలోనే బన్నీ సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి’ మరియు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈచిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం మెగా ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతుంది.