సరైన టైంలో వస్తున్న ‘డీజే’

Allu Arjun Duvvada Jagannadham Movie Release On 23rd Confirn

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Allu Arjun Duvvada Jagannadham Movie Release On 23rd Confirm

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం ఈనెల 23న రావడం ఖాయం అయ్యింది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకుంది. బ్రహ్మణ సంఘాలు కాస్త లొల్లి చేస్తున్నా కూడా పెద్దగా వాటిని పట్టించుకోకుండా నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్‌లో భారీగా విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. గత రెండు మూడు వారాలుగా వస్తున్న చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. 

‘బాహుబలి 2’ చిత్రం తర్వాత స్టార్‌ హీరో చిత్రం ఇప్పటి వరకు వచ్చింది లేదు. చిన్న చిన్న చిత్రాలు వచ్చినా కూడా అవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. కొన్ని చిత్రాలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా మాస్‌ ఆడియన్స్‌ మాత్రం స్టార్‌ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లోటును ‘డీజే’ చిత్రంతో అల్లు అర్జున్‌ పూడ్చె అవకాశాలున్నాయి. మంచి సమయంలో దిల్‌రాజు ‘డీజే’ను వదల బోతున్నాడని, తప్పకుండా బన్నీ కెరీర్‌లో ఇదో మైలురాయి చిత్రంగా నిలుస్తుందని, రికార్డు బ్రేకింగ్‌ చిత్రం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. టాలీవుడ్‌ టాప్‌ 5 చిత్రాల జాబితాలో ‘డీజే’ స్థానం దక్కించుకోవడం ఖాయంగా మెగా ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ఖైదీ తర్వాత మెగా ఫ్యాన్స్‌కు ఆ స్థాయిలో వినోదాన్ని అందించనున్నట్లుగా చెబుతున్నారు. చిరంజీవి తర్వాత అల్లు అర్జున్‌ ఈ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన మెగా హీరోగా రికార్డు సాధించడం ఖాయంగా ట్రేడ్‌ పండితులు సైతం చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ‘డీజే’ సందడి మొదలు కాబోతుంది.

మరిన్ని వార్తలు

స్పైడర్‌కు నమ్రత సాయం!!

నిన్ను కోరి మూవీ ట్రైలర్ అదిరింది…

సరైన టైంలో వస్తున్న ‘డీజే’ - Telugu Bullet