స్పైడర్‌కు నమ్రత సాయం!!

mahesh wife namratha help to spyder movie for bollywood distributions,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mahesh Wife Namratha  Help To Spyder Movie For Bollywood Distributions

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘స్పైడర్‌’. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా డబ్బింగ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో ఒక ప్రముఖ నిర్మాత భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా బిజినెస్‌ కాస్త డల్‌గా ఉంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమా తీసుకుంటాడనే వార్త మొదట వచ్చింది. కాని ఆయన ఇతరత్ర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కారణంగా హిందీలో ‘స్పైడర్‌’ను విడుదల చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడు.

స్పైడర్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌ తీసుకు వెళ్లే బాధ్యత ఇప్పుడు నమ్రత శిరోత్కర్‌పై పడ్డట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌లో తనకున్న పరిచయాలతో ‘స్పైడర్‌’ను అక్కడ భారీ బిజినెస్‌ చేసేందుకు నమ్రత ప్రయత్నాలు చేస్తుంది. ప్రముఖ నిర్మాతతో ప్రస్తుతం ఆమె చర్చలు జరుపుతుందని, ఫ్యాన్సీ రేటుకు స్పైడర్‌ చిత్రాన్ని ఆయన తీసుకునేందుకు ముందుకు వస్తాడనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. గతంలో మహేష్‌బాబు నటించిన ఏ సినిమాల బిజినెస్‌ విషయంలో కూడా నమ్రత తలదూర్చిన దాఖలాలు లేవు. కాని బాలీవుడ్‌లో మహేష్‌ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో ఆమె ఈ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

నిన్ను కోరి మూవీ ట్రైలర్ అదిరింది…

మాస్‌ అనుకుంటే క్లాస్‌ ఇచ్చాడు

స్పైడర్‌కు నమ్రత సాయం!! - Telugu Bullet