నంద్యాల గెలవాలంటే.. గోస్పాడు నిలవాలి

Gospaadu Is Main Constituncy Nandyala By Elections For TDP And YSRCP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Gospaadu Is Main Constituncy Nandyala By Elections For TDP And YSRCP

నంద్యాల నియోజకవర్గంలో ఆళ్లగడ్డ నుంచి వచ్చి కలిసిన గోస్పాడు చాలా కీలకంగా మారింది. ఇక్కడ భూమా ప్రాభవం బాగా ఉంది. మరి ఈసారి భూమా బ్రహ్మానందరెడ్డికి ఎంతమంది కలిసొస్తారనే అంశమే ప్రధానం. గోస్పాడులో మెజార్టీ ఓట్లు పడితే.. ఇక భూమా ఫ్యామిలీకి ఎదురు లేదని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఉపఎన్నికల ముందే గోస్పాడులో పట్టు కోసం టీడీపీ, వైసీపీ పోటీపడుతున్నాయి.

భూమా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో నంద్యాలలో ప్రస్తుతం భూమా ఫ్యామిలీపై విపరీతమైన సానుభూతి ఉంది. రెండున్నరేళ్ల వ్యవధిలో అటు తల్లిని, ఇటు తండ్రిని పోగొట్టుకున్నారని అఖిలప్రియమీద కూడా చాలా సానుభూతి ఉంది. దీనికి తోడు అఖిలప్రియ పనితీరు కూడా సామాన్యుల్ని ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ దూకుడుగా వెళ్తోందని పార్టీ నేతలకు అనిపిస్తున్నా.. ఆమె వర్గంలో మాత్రం అదే కరెక్ట్ అనే భావన కనిపిస్తోంది.

గోస్పాడులో భూమా ఫ్యామిలీ ఓట్లతో పాటు.. ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ జరగాలనే పట్టుదలతో అఖిల పనిచేస్తున్నారు. మంత్రిగా తన హోదాను ఉపయోగిస్తూనే.. అవసరమైన చోట తండ్రి పేరును కూడా వాడుతున్నారని తెలుస్తోంది. శిల్పా చెబుతున్నంత అమాయకంగా అఖిలప్రియ లేరని, ఆమెకు నియోజకవర్గంలో తన బలాలు, బలహీనతలపై మంచి పట్టుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు :

నారాయణ ని చూసి నేర్చుకోండి.

కేజ్రీవాల్ శకానికి తెర పడనుందా..?