ఎన్నిరోజులైనా గుండెలో బుల్లెట్ అలాగే ఉంది

YSRCP Not Forgetting The Defeat In The Nandhyala Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాలం గాయాలను మాన్చేస్తోంది అంటారు. ముఖ్యంగా మనసుకు తగిలిన కష్టాలు పోవాలంటే.. కాలం గడవాల్సిందే అంటారు. కానీ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ అంత తేలిగా మర్చిపోవడం లేదు. ఎందుకంటే కాకినాడ సంగతి పక్కనపెట్టినా.. నంద్యాలలో మాత్రం గెలుపు ఖాయం అనుకున్నారు. పందాల లెక్కలు చూసినా అదే నిజమని నమ్మారు. కానీ ఫలితం షాక్ కొట్టేలా వచ్చింది. నంద్యాల ప్రచారంలో మొదట్నుంచీ వైసీపీకి అంతా అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా శిల్పా చక్రపాణిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. దాన్ని బహిరంగ సభలో ప్రదర్శించి జగన్ … చంద్రబాబును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా ఈ స్టెప్ కు ఎలాంటి కౌంటర్ వేయాలో తెలియక చంద్రబాబు చాలా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. కానీ అంతలోనే జగన్ ఆయనకు బ్రహ్మాస్త్రం అందించారు.

బాబును జగన్ తిట్టిన చావుతిట్లతో.. జగన్ పక్కనే నుంచున్న శిల్పా మోహన్ రెడ్డి కూడా ఇబ్బందికరంగా ముఖం పెట్టడం చాలా టీవీ ఛానెళ్లు పదేపదే హైలైట్ చేశాయి. ఇక వైసీపీ అభిమానులు కూడా జగన్ ఫ్యాక్షనిస్టు అన్న టీడీపీ ఆరోపణలు నిజం చేసేలా ఆయన వ్యాఖ్యలు చేశారని బాథపడ్డారు. ఇక రోజా చుడీదార్ వ్యాఖ్యలు సరేసరి. కీలక నేతలైన వీరిద్దరూ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు తప్పేలా లేవు.

మరిన్ని వార్తలు:

ఆగ‌ని ఉత్త‌ర‌కొరియా క‌వ్వింపు చర్య‌లు

అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మ‌ల