ఇంకా బుద్ధి మార్చుకోని చైనా

China Sensational Comments On Doklam controversy.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డోక్లాం వివాదంలో తోక ముడిచిన చైనాకు ఇంకా బుద్ధి రాలేదు. సరిహద్దుల్లో కవ్వింపులు కొనసాగుతాయని పరోక్షంగా కామెంట్ చేసింది. సరిహద్దుల్లో తమ దేశ భూభాగంలో రోడ్లేస్తే.. భారత్ కు భయమెందుకని డ్రాగన్ విపరీత వ్యాఖ్యానాలు చేస్తోంది. టిబెట్ సరిహద్దులో భారత్ కు దగ్గర్లో ఉన్న తమ వైపు భూభాగంలో రోడ్లు వేస్తున్నారు చైనా అధికారులు. డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి తీరతామని చైనా విదేశాంగ శాఖ డబ్బా కొడుతోంది. టిబెట్ – జిన్ జియాంగ్ ప్రాంతంలో రోడ్లు వేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో.. భారత్ బలగాలు నిశితంగా గమనిస్తున్నాయి. మొన్నటివరకూ 75 రోజుల పాటు డోక్లాం వివాదంపై చర్చలు జరిగి.. అంతా ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో.. చైనా తాజాగా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

చైనా ఆర్థికంగా గొప్ప దేశం అయితే కావచ్చు. కానీ ఆ దేశ పునాదులు చాలా బలహీనం అని అందరికీ తెలుసు. అంతర్జాతీయంగా కూడా చైనాకు పెద్దగా పేరేం లేదు. భారత్ అంటే గౌరవించే చాలా దేశాలు.. చైనా నీడను కూడా సహించవు. అందుకే మొన్న డోక్లాం వివాదంలో చైనాకు ఏ దేశం మద్దితవ్వలేదు. అయినా దుందుడుకు చర్యలకు దిగుతున్న చైనాకు తగిన బుద్ధి చెప్పాలని భారత్ చూస్తోంది.

మరిన్ని వార్తలు:

నారా బ్రాహ్మణి సినిమా యాంగిల్

రూ. 200 నోటు కోసం మూడు నెల‌లు ఆగాల్సిందే