కేజ్రీవాల్ శకానికి తెర పడనుందా..?

manish sisodia troubling AAP party and Delhi kejriwal government

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Manish Sisodia Troubling AAP Party And Delhi Kejriwal Government

సామాన్యుడి పార్టీ అంటూ ఢిల్లీ గడ్డపై సంచలన విజయం సాధించిన కేజ్రీవాల్.. ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పడిపోతున్నారు. కేంద్రంతో చీటికీమాటికీ కయ్యాలు, పాలనా వైఫల్యాలు, ఎమ్మెల్యేల అవినీతి.. ఇలా ఒకటని కాదు.. చాలా వ్యవహారాలు కేజ్రీకి ఇబ్బందికరంగా మారాయి. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఢిల్లీలో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఏకంగా సీఎం ఆఫీస్ అధికారి ఇంటిపైనే సీబీఐ దాడులు జరిగాయి. ఇప్పుడు డిప్యూట సీఎం ఇంటిపైనా జరిగాయి.

టాక్ టు ఏకే పేరుతో కేజ్రీవాల్ తో ఢిల్లీ ప్రజల ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున నిధులు పోగేశారని, వాటిని అక్రమంగా దారి మళ్లించారనేది మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగం. దీంతో రోజంతా ఆయన నివాసాల్లో సోదాలు చేసిన సీబీఐ.. తాము కేవలం నిబంధనల అతిక్రమణ గురించి అడగడానికే వచ్చామని, ఇంకా దాడులు మొదలు కాలేదని చెప్పడం ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ట్విస్ట్.

జైట్లీతో పరువునష్టం కేసులో ఎదురుదెబ్బ తిన్న కేజ్రీకి.. ఇప్పుడు ఆయన కుడిభుజంగా చెప్పుకునే సిసోడియాపై సీబీఐ నజర్ వేయడంతో నిద్రపట్టడం లేదు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదని రాజకీయ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీమీద దృష్టి పెట్టడం లేదని సొంత క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇలాంటి సమయంలో మరో షాక్ తగిలితే ఆప్ మనుగడ కష్టమనే వాదన వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు :

జేసీ సారీ చెప్పిందెవరికి?

ఇక వాళ్ళతో కటీఫ్ అంటున్న జేసీ.