సుక్కూకు చిర్రెత్తుకు వస్తుందట!

Sukumar Irritating with Mega Family Interference In Rangasthalam 1985

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sukumar Irritating with Mega Family Interference In Rangasthalam 1985

మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేయాలి అంటే దర్శకులు కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో దర్శకుడు తన నిర్ణయం కాకుండా ఇతరుల నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తప్పదు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం 1985’ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తనదైన శైలిలో విభిన్న చిత్రాలు చేసే సుకుమార్‌కు కూడా మెగా ఫ్యామిలీ నుండి ఫింగరింగ్‌ తప్పడం లేదు.

చిత్ర టైటిల్‌ విషయం నుండి అన్ని విషయాల్లో కూడా మెగా వేలు ఉంటుందని, దాంతో సుకుమర్‌ పలు సందర్బాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ విషయంలో రెండు మూడు సీన్స్‌ను వారు చెప్పినట్లుగా మార్చడం జరిగింది. టైటిల్‌ విషయంలో కూడా మెగా ఒత్తిడి చాలానే వచ్చింది. అయినా కూడా సుకుమార్‌ తాను అనుకున్నదాన్నే ఫైనల్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ కొన్ని సీన్స్‌లలో మెగా ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి అభ్యంతరం చేయడంతో సుకుమార్‌కు చిర్రెత్తుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

నాగబాబుకు పునర్‌వైభవం దక్కేనా?

సల్మాన్‌ చెత్త వ్యాఖ్యలు