ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లారిటీ

Allu Arjun fans' clarity for the audience
Allu Arjun fans' clarity for the audience

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ సినిమా ఇండియన్ రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ మూవీ కు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో కొందరు హేటర్స్ ఈ మూవీ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

Allu Arjun fans' clarity for the audience
Allu Arjun fans’ clarity for the audience

అంతేగాక, కొందరు అల్లు అర్జున్ అభిమానులం అంటూ పలు టీవీ డిబేట్ లు, యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ వారికి నచ్చింది మాట్లాడుతున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా క్లారిటీ కూడా ఇచ్చింది. అల్లు అర్జున్ అభిమానులు ఎవరూ ఇలా టీవీ డిబేట్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని.. ఒకవేళ వారు అలా చేస్తున్నారంటే అది వారి సొంత అభిప్రాయం కిందే పరిగణించాలి. బన్నీ అభిమానులతో వారికి ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు . ఇతర హీరోల అభిమానులకు తమకు మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు గ్రూపులుగా మారి ఇలా చేస్తున్నారని వారు పేర్కొన్నారు.