Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. మొదటి నుండి సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ డబుల్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే ట్రైలర్‌పై పలువురు మెగా హీరోలు మరియు ఇతర సినీ వర్గాల వారు తమ స్పందన తెలియజేశారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు తన స్పందనను తెలియజేసింది లేదు. కనీసం చిన్న ట్వీట్ కూడా సినిమా గురించి లేదా టీజర్ గురించి చేయలేదు. దాంతో మెగా హీరోల మద్య విభేదాలు అంటూ మళ్లీ పుకార్లు షికర్లు చేస్తున్నాయి.
చాలా కాలంగా అల్లు అర్జున్‌కు రామ్ చరణ్‌కు మద్య కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నిజమేనేమో అంటూ మరోసారి మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కంటే తానే ఎక్కువ సినిమాలు చేశాను అని, అందులో ఎక్కువ విజయాలు ఉన్నాయని అల్లు అర్జున్ అభిప్రాయం అని కొందరు అంటుంటారు. అందుకే రామ్ చరణ్ ఏ సినిమా చేసినా కూడా బన్నీ పెద్దగా పట్టించుకోడు అని, రంగస్థలం చిత్రంపై సుకుమార్‌పై అభిమానంతో అయిన బన్నీ ట్వీట్ చేస్తాడని అంతా భావించారు. కాని బన్నీ మాత్రం ఆ విధంగా చేయలేదు. ఇది ఖచ్చితంగా చరణ్‌పై జలసీ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి బన్నీ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.