కొడుకుని కాల్చిన బన్నీ …వైరల్ అయిన వీడియో

Allu Arjun Imitating Priya Prakash Varrier With His Son Ayaan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రియ వారియర్ ఒక్క వీడియో తో యుట్యూబ్ లోను అటు సోషల్ మీడియా అకౌంట్స్ పేస్ బుక్ ,ఇంస్టాగ్రాం లలో కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది .ఆమె కి అన్ని వైపులా అభిమానులు రోజు రోజు కి పెరిగిపోతున్నారు.టాలీవుడ్ లో కి కూడా ప్రియా వారియర్ ను తీసుకు రావడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.మన బన్నీ కూడా ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయ్యి ఆమెకి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసాడు.

ఈ సారి ఏకంగా తన కొడుకు తో ప్రియ వారియర్ గన్ సీన్ ని అనుకరిస్తూ వీడియో పెట్టాడు.వేళ్లకు ముద్దు పెట్టి.. గన్ ట్రిగ్గర్ మాదిరిగా చేతితో లాగి.. ముద్దుగా తుపాకీ పేల్చేసి తన కొడుకు ని కాల్చాడు .అల్లు అయాన్ కూడా గన్ తగిలిన వాడిలా బెడ్ మీద పడిపోయాడు.ఇక ఈ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియో లో అయాన్ కూడా ఎంతో ముద్దు గా ఉన్నాడు .తండ్రి కొడుకుల ఈ సరదా వీడియో ని చూసి అల్లు వారి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు .