అల్లు అర్జున్ రిమాండ్: నాంపల్లి కోర్టు కీలక తీర్పు..!

Allu Arjun remand: Nampally court gives key verdict
Allu Arjun remand: Nampally court gives key verdict

అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుందని … హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని కోర్టులో బన్నీ తరపు లాయర్లు కోరారు. వారి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు… బన్నీకి రిమాండ్ విధించింది.

Allu Arjun remand: Nampally court gives key verdict
Allu Arjun remand: Nampally court gives key verdict

కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించే అవకాశాలున్నాయి. అయితే, హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్నందున… హైకోర్టు తీర్పు వచ్చాకే బన్నీ రిమాండ్ పై స్పష్టత రానున్నది .

ఒక వేళ హైకోర్టులోనూ చుక్కెదురైతే… కోర్టు మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంచల్ గూడ జైలు వద్ద కూడా పోలీసు ఫుల్ బందోబస్తుని పెంచినట్టు తెలుస్తోంది.