ఇలా మోసం చేయొద్దు

ఇలా మోసం చేయొద్దు

క్రిస్‌మస్‌ వేడుకులను మెగా హీరోలంతా ఒకేచోట జరుపుకున్నారు. శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో రామ్‌చరణ్‌-ఉపాసన, చైతన్య-నిహారిక దంపతులు, వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌తో పాటు చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మితా ఒకే చోట హాజరై సందడి చేశారు. వీరందరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సెలబ్రేషన్స్‌లో నిహారిక, అల్లు అర్జున్‌ శాంటాక్లాజ్‌గా మారినట్లు కనిపిస్తోంది. నిహారిక.. చెర్రీకి గిఫ్టులిచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. ‘ఎవరికీ తెలియకుండా, ఏ అనుమానం రాకుండా ఇంట్లో బహుమతులను దాయడం ఎంత కష్టమో పక్కనపెడితే నీకు సీక్రెట్‌ శాంటాగా ఉండటం నాకిష్టం చరణ్‌ అన్న.. అలాగే ఎంతో ఓపికగా నాటునాటు పాటకు స్టెప్పులు నేర్పించినందుకు థ్యాంక్స్‌’ అని రాసుకొచ్చింది.

బన్నీ కోసం చెప్తూ.. ‘ఇదిగో ఇక్కడుంది నా శాంటా.. సినిమా ప్రమోషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా నాకోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చాడు. థాంక్యూ బన్నీ అన్నా.. నెక్స్ట్‌ టైం మాత్రం ఇలా మోసం చేయొద్దే..’ అని అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ఇంతకీ నిహారిక మోసం చేయొద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. బహుశా బన్నీ ఈసారి ఏ గిఫ్టూ ఇవ్వలేదేమోనని కామెంట్లు చేస్తున్నారు.