Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంగస్థలంలో రామ్ చరణ్ తేజ్ గళ్ల లుంగీ పైకికట్టి… రంగు బనీన్… మెళ్లో టవల్ తో డాన్స్ వేస్తున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్ బాగా హైలెట్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ పోస్టర్ ను నెటిజన్లు చాలా మంది షేర్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులనే కాదు… ఈ పోస్టర్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ను కూడా తెగ ఆకర్షించినట్టుంది. అయాన్ తన మామ రామ్ చరణ్ లాగే గళ్ల లుంగీ పైకి కట్టుకుని, గళ్లచొక్కా, రంగు బనీన్ వేసుకుని మెడపై టవల్ పట్టుకుని పోజ్ ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఈ ఫొటోను అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే అర్జున్, చరణ్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
మామకు తగ్గ అల్లుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పొటోతో అల్లుఅర్జున్ ఓ విషయంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టయింది. చరణ్ కు, అర్జున్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని, అందుకే రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అర్జున్ రాలేదని, సినీ ప్రముఖులంతా రంగస్థలం ట్రైలర్ గురించి ప్రశంసిస్తున్నా… అల్లు అర్జున్ మాత్రం పట్టనట్టు ఉంటున్నాడని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనయుణ్ణి చిట్టిబాబులా అలంకరించి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ప్రచారానికి అల్లుఅర్జున్ తెరదించినట్టయింది.