స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” చిత్రం ఇప్పుడు మ్యూజికల్ గా మాత్రం అతి పెద్ద హిట్టయ్యిపోయింది.ఇప్పటికే “సామజవరగమన” మరియు “రాములో రాముల” సాంగ్స్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డులని నెలకొల్పాయి.అలా రికార్డులను నెలకొల్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూనే ఉన్నాయి.
అలాగే ఇప్పుడు కూడా జస్ట్ చిన్న సాంగ్ బిట్ తోనే మరోసారి అల వైకుంఠపురములో చిత్రం యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.ఏఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ గా “బుట్ట బొమ్మ” ను సంగీత దర్శకుడు థమన్ చెప్తున్నారు.రికార్డింగ్ తర్వాత కూడా ఈ సాంగ్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది అని వారు చెప్పారు.అలా ఏఈ సాంగ్ తాలూకా చిన్న బిట్ నిన్ననే విడుదల చెయ్యగా యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేసింది.కేవలం 5 గంటల్లోనే టాప్ 3కి వచ్చేసింది.ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది.మొత్తానికి ఈ సాంగ్ మాత్రం అతిపెద్ద చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందని చెప్పాలి.