అల్లు అర్జున్ చంకెక్కిన హీరోయిన్ శ్రీలీల‌…

అల్లు అర్జున్ చంకెక్కిన హీరోయిన్ శ్రీలీల‌...
Sreeleela new movies

టాలీవుడ్ యువ నటి శ్రీలీల ను అదృష్టం అస్సలు వదలడం లేదు. పెళ్లిసందD అనే చిన్న చిత్రంతో తెరంగేట్రం చేసిన అమ్మాయి ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్స్, ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన శ్రీలీల‌ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి.

పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఆదికేశవ విడుదలకు సిద్ధం అవగా.. బోయపాటి శ్రీను-పోతినేని రామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం, నితిన్ 32వ సినిమాలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి, విజయ్ దేవరకొండ 12వ సినిమా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం, ఓ కన్నడ సినిమాలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది.

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ రూపొందిస్తున్న ఒక సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం శ్రీలీల‌ కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఓ స్టెప్పులో బన్నీపైన ఆమె కూర్చున్న క్యూట్ పోస్టర్ ను సైతం విడుదల చేసింది. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తునారు .