ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం తగ్గని అమల అక్కినేని

ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం తగ్గని అమల అక్కినేని

తన వర్క్‌ అవుట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన సీనియర్‌ నటి, నాగార్జున సతీమణి అమల, మహిళ బలంగా ఉండరని ఎవరన్నారు అంటూ ప్రశ్నించింది.ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, హీరో నాగార్జున సతీమణి అమల సినిమాలకు దూరంగా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే అమల ఇటీవల అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శర్వాకు తల్లిగా నటిస్తున్నారు అమల.

తల్లి పాత్రలో కనిపిస్తున్నా ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. శనివారం తన వర్క్‌అవుట్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు అమల. 71 కేజీల వెయిట్‌ను అమల ఎత్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోతో పాటు `ఈ రోజు 71 కేజీల వెయిట్‌ ఎత్తాను. మహిళలు బలంగా ఉడరని ఎవరన్నారు, స్ట్రాంగ్‌ బాడీ, స్ట్రాంగ్‌ మైండ్‌ అందరూ స్ట్రాంగ్‌గా ఉండండి` అంటూ కామెంట్‌ చేశారు. కింగ్‌ నాగార్జున ఇంట్లో అందరూ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.