మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. కేరళలో ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కానీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అమలాపాల్ అసలు పేరు అనఖ. అయితే.. మాలివుడ్ బ్యూటీ అమలాపాల్, జగత్ జోషి వివాహం ఆదివారం అతికొద్ది మంది సమక్షంలో చాలా ఘనంగా జరిగింది.
విక్రమ్ ‘నాన్న’ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్ ‘నాయక్’, నాగచైతన్యతో ‘బెజవాడ’, నానితో ‘జెండాపై కపిరాజు’ సినిమా లతో మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకనో ఆ తర్వాత సరైన అవకాశాలు లేక తెలుగుకు దూరమైంది. ఇప్పుడు ఆడపాదడపా మలయాళం సినిమా లు చేస్తూ వస్తుంది.2014లో తమిళ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న అమలాపాల్ 2017లో విడాకులు తీసుకుని సింగిల్ గానే ఉంటుంది. ఇక తాజాగా రెండో పెళ్లి చేసుకున్నది .