తీవ్రమైన పోరాటం చేస్తున్నఅమరావతి రైతులు

తీవ్రమైన పోరాటం చేస్తున్నఅమరావతి రైతులు

అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పార్టీ కి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాన్ని చేస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైతుల విషయంలో ఎంతకీ స్పందించకపోవడంతో నేటి నుండి తమ సమ్మెని ఉదృతం చేస్తూ, సకల జనుల సమ్మెని జరపనున్నట్లు అమరావతి రైతులందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాగా రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం దారుణమైన అన్యాయాన్ని చేస్తుందని ఆరోపిస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్ని కూడా ముక్తఖంఠంతో నినాదిస్తున్నాయి. ఈమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… అమరావతిలో రోడ్డున పడ్డ రైతులు, వారి పిల్లలు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే అసలు విషయం ఏంటంటే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2015 లో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ నమ్మకాన్ని, తమ భవిష్యత్తుని, తమ కోరికలని అన్నింటిని కలిపి తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. కానీ ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోతే అలాంటి పరిస్థితుల్లో రైతుల నుండి ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్న సమయంలో మనం ఎంత జవాబుదారి తనంతో జాగ్రత్తగా ఉండాలి అని వివరించారు.

అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసమని భూములిచ్చిన రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతె భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఇకపోతే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా అమరావతిలోని రైతులందరికీ కూడా జనసేనపార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈమేరకు జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా సదరు వీడియో ని పోస్టు చేశారు.