ర‌క్త హీన‌త స‌మ‌స్య పరార్

ర‌క్త హీన‌త స‌మ‌స్య పరార్

అస‌లు ఇంత‌కీ అతి మ‌ధురం పొడి ఎలా వాడాలి.? దీని వ‌ల్ల ల‌భించే ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌నే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను నివారించ‌డంలో అతి మ‌ధురం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. అర స్పూన్ అతి మ‌ధురం పొడిలో ప‌ది ఎండు ద్రాక్ష‌లు వేసి బాగా దంచి ముద్ద‌లా చేసుకుని తినాలి. ఇలా ప్ర‌తి రోజు చేస్తే ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరిగి ర‌క్తహీన‌త స‌మ‌స్య పరార్ అవుతుంది.

స్పూన్ సోంపు వేసి బాగా మ‌రిగించాలి. ఆపై ఫిల్ట‌ర్ చేసుకుని తీసుకుంటే గ‌నుక జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెరుగుతుంది. అదే స‌మ‌యంలో బాడీ లోకి వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోయి లివ‌ర్ మ‌రియు మూత్ర పిండాలు శుభ్ర ప‌డ‌తాయి.

జీర్ణ క్రియ చురుగ్గా మారి మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గుతుంది. అతి మ‌ధురం పొడితో బ్రష్ చేసుకుంటే నోటి దుర్వాస‌న‌, నోటి పూత‌, దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి. గ్లాస్ పాల‌ల్లో ఒక స్పూన్ అతి మ‌ధురం పొడి క‌లిపి తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢ పడ‌తాయి. సంతాన స‌మ‌స్య‌లు ఉంటే న‌యం అవుతాయి. మ‌రియు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

దగ్గును తగ్గించడంలో అతిమధురం బాగా పనిచేస్తుంది. దీనికి కాస్త తేనె కలిపి… పూటకు పావు టీ స్పూన్ చొప్పున తాగితే… దగ్గు పోయినట్లే. కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పుల వంటివి కూడా తగ్గుతాయి. జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే మందుల్లో అతి మధురాన్ని వాడుతారు.అతిమధురం, అశ్వగంధ, శొంఠిని సమానంగా పొడి చేసుకొని… పాలు తాగిన ప్రతిసారీ అర టీ స్పూన్ పొడిని వేసి… తాగితే… కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గిపోతాయి.

అతిమధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక టీ స్పూన్ చొప్పున అరకప్పు నీటిలో కలిపి తాగితే… అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. అరకప్పు పాలలో కలిపి తాగితే… బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది. అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి.

అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు తాగుతుంటే… స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గుతాయి. రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. అతిమధుర చూర్ణాన్ని గాయాలు, పుండ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి వెంటనే మానతాయి.

ములేటీ, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, గ్లాసు పాలలో ఒక స్పూను చూర్ణం, ఒక స్పూను పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజూ ఒకటి రెండుసార్లు తాగుతుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడమే కాక, లైంగిక కార్యం తరువాత కలిగే నీరసం, నిస్సత్తువ, కండరాలు బిగదీసుకున్నట్లు ఉండే ఇబ్బందులు తొలగుతాయి.

డిప్రెషన్ వంటి మానసిక చికాకులతో బాధపడుతున్నప్పుడు అతి మధుర చూర్ణంకి కాస్తంత పత్రి కలిపి తీసుకుంటే మానసిక చిక్కులు తగ్గిపోతాయి. మనసు ఉల్లాసంగా మారుతుంది. మతిమరుపుతో బాధపడుతున్నప్పుడు, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నప్పుడు అతిమధురంకి సరస్వతి ఆకు, పటికబెల్లంని సమపాళ్ళలో కలిపి దాన్ని అరకప్పు పాలలో నిత్యం తీసుకుంటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఏకాగ్రత కూడా చక్కగా కుదురుతుంది.

పాలు పండ్లు కషాయాలు తాగడం అలవాటుగా చేసుకున్నారు. మన బాడీలో ఇమ్యూనిటీ అధికంగా ఉండటం వల్ల బారిన పడకుండా, ఇతర వైరస్‌ల నుంచి మనల్ని కాపాడుకోవడానికి, ఆ వ్యాధికారక వైరస్‌లతో పోరాడడానికి మన బాడీలో ఇమ్యూనిటీ ఎంతో అవసరం. అయితే ఈ రోజు ములేటి టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ఇందులో ఉన్న యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీవక్రియ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రేగు కదలికలను మెరుగు పరుస్తుంది. రోజు ముల్లేటి బెరడును నమలడం గొంతునొప్పికి పాత నివారణ పద్ధతి. దగ్గు, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను నయం చేయడంతోపాటు, దీర్ఘకాలిక ఉబ్బసం లక్షణాలను తగ్గించగలదు. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్దకాన్ని నివారించడంతో పాటు, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ములేటి నీటిలో బాగా మరిగించి, ఆ నీటిని వడబోసి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర వేసుకుని రోజు ఉదయం ఈ టీ తాగడం వల్ల, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ములేటి బెరుడులో ఉన్న ఎంజైమ్స్ స్వయం ప్రతిరక్షక వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ జీవులపై పోరాడి వాటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. చర్మ వ్యాధులను నయం చేసి, మెరుస్తున్న చర్మాన్ని పొందడానికి ఈ ముల్లేటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.