Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ లో గవర్నమెంట్ ఆఫీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క ఫైలుపై సంతకం కావాలంటే.. కనీసం నెల రోజులన్నా ఎధురుచూడాలి. ఇక ఆ ఫైల్లో మ్యాటర్ అమలు కావాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. కానీ అమెరికాలో అదేం ఉండదు. అది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. నిమిషాల వ్యవధిలో పనులు జరిగిపోతాయని చాలామందిలో ఓ పిచ్చి భ్రమ ఉంది. కానీ అది నిజం కాదని గ్రీన్ కార్డ్ ఇష్యూ నిరూపించింది. గ్రీన్ కార్డుల జారీకి అమెరికా తీసుకుంటున్న సమయం చూస్తే.. దాని కంటే మన ఉద్యోగులు చాలా బెటర్ అనిపిస్తుంది.
విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఇవ్వడమే గ్రీన్ కార్డ్ ముఖ్యోద్దేశం. అలాంటి గ్రీన్ కార్డ్ ను ఆగమేఘాల మీద మంజూరు చేయాలి. ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నా.. కనీసం ఏడాదిలో అయినా కార్డు మంజూరు చేసే వ్యవస్థ అమెరికాలో ఉంది. కానీ అక్కడి అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కపెడుతూ.. నత్తను తలపించేలా పని చేస్తున్నారట. గ్రీన్ కార్డుకు అప్లికేషన్ పెట్టాక.. అది రావాలంటే కనీసం పన్నెండేళ్లు పడుతుందట. ప్రస్తుతం 2005లో అప్లికేషన్ల పరిశీలన జరుగుతోందట. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ లేటౌతున్నా.. ఎక్కువగా కార్డులు పొందుతున్న దేశాల్లో ఇండియా ముందుంది. అయినా సరే అంత లేటేంటని ప్రవాస భారతీయులు తెగ ఇదైపోతున్నారట. మన దగ్గర కుర్రాళ్లకు సాఫ్ట్ వేర్ జాబా కాదా అని చూసినట్లే.. అమెరికా సంబంధాల్లో కూడా అబ్బాయికి గ్రీన్ కార్డ్ ఉందా.. లేదా అని చూడటం కామనైపోయింది. గ్రీన్ కార్డ్ ఉంటే ఓ రేటు, లేకపోతే మరో రేటు కూడా కట్నాలు ఉన్నాయి. అందుకే గ్రీన్ కార్డ్ అంత లేటుగా వస్తే తమకు చాలా లాసౌతుందని మథనపడుతున్నారు కుర్రాళ్లు.
మరిన్ని వార్తలు:
జియో కొత్త ప్లాన్స్ వచ్చేశాయ్!
రాళ్ళు కొట్టలేకపోయిన రాజకుమారి