అమెరికన్ డెమొక్రాట్ సభ్యురాలు కేటీ హిల్ తన రాజీనామా లేఖను సమాజం, తన ప్రాంత ప్రయోజనాల కోసం ఇది సబబు అయిన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానిస్తు ట్విటర్‌లో పోస్ట్ చేసారు.
అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికల సమయంలో తన ప్రచార సిబ్బందితో ఒకరితో సంబంధం ఉన్న విషయం వాస్తవమే అని కేటీ హిల్ ఒప్పుకుని ఇపుడు తనకు తన కార్యాలయ సిబ్బందితో లైంగిక సంబంధం లేదని వెల్లడించారు.ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరపగ యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన డెమొక్రాట్ సభ్యురాలు కేటీ హిల్ రాజీనామా చేశారు.
ఎథిక్స్ కమిటీ కాలిఫోర్నియా నుంచి కేటాయించిన సిబ్బందితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని తెలియ చేసింది. దీనిపై కేటీ హిల్ స్పందిస్తూ తనపై తప్పుడు వాదనలు జరుగుతున్నాయని, అభ్యంతరకర ఫోటోలు విడుదల చేసిన మీడియాపై చట్టపరమైన చర్యలు చేసేలా చేస్తానని తెలిపారు