పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ హీరొయిన్

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ హీరొయిన్

నటుడు విక్రం తో ‘ఐ’  సినిమా లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అమీజాక్సన్.అయితే ఇటివల ఆమె గర్బం దాల్చిన విషయం తెలిసిందే. ఆమె ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు ఆండ్రియాస్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన కుమారుడు, భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. బ్రిటన్‌కు చెందిన జార్జ్ అనే వ్యాపారవేత్తతో అమీ 2015 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలో జనవరిలో అమీ గర్భం దాల్చారు. అదే నెలలో అమీ, జార్జ్‌లు నిశ్చితార్థం చేసుకున్నారు.

నెలలు గడిచే కొద్ది తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. తనకు మగపిల్లాడు పుట్టబోతున్నాడని తెలిసి ఘనంగా సీమంతం వేడుకలను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పుడు అమీ ఎటూ బిడ్డను కన్నారు కాబట్టి త్వరలో జార్జ్‌ను పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన అమీ 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. 2009లో మిస్ టీన్ వరల్డ్ టైటిల్‌ను అందుకున్నారు. 2010లో ‘మద్రాసపట్టణం’ అనే తమిళ చిత్రంతో అమీ తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అన్ని భారతీయ భాషల్లోనూ అమీ సినిమాలు చేశారు. 2012లో వచ్చిన ‘ఏక్ దివానా థా’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ఏ మాయ చేశావె’ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది.

ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ‘ఎవడు’. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా ‘2.o’లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అమీ నటించిన చివరి చిత్రమిది. ఈ సినిమా తర్వాత అమీ గర్భం దాల్చడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు బ్రిటన్‌కు వెళ్లిపోయారు.