నిర్మాణ సంస్థః ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితినాథ్, తనికెళ్ళ భరణి, శ్యామల, అనంత్ తదితరులు
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
ఛాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె.సి.నరసింహారావు
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
జెంటిల్ మెన్ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా అనగానే ట్రాక్ మారాక ఇంకా డిఫరెంట్ మూవీ ఇస్తాడని అందరూ ఆశించడం సహజం. ఇంద్రగంటి తాజాగా తీసిన అమీతుమీ ఆ అంచనాలకు తగ్గట్టు వుందా, లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ… జనార్దన్ కి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు విజయ్ (అవసరాల శ్రీనివాస్ ), కూతురు దీపిక (ఇషా ). దీపిక ఓ సేల్స్ మేనేజర్ ని ప్రేమిస్తుంది. అతనితో పెళ్లి జనార్దన్ కి ఇష్టం ఉండదు. కూతురు కోసం శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్) ని సెలెక్ట్ చేస్తాడు. దీపిక అన్న ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే నాన్న చూసిన సంబంధం ఇష్టం లేని దీపిక పనిమనిషితో కలిసి ఓ నాటకం ఆడుతుంది. దాని పర్యవసానం ఏమిటి? ఆ అన్నాచెల్లెళ్లు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారా, లేదా అన్నది మిగతా కథ.
విశ్లేషణ… ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెలుగు దర్శకుల్లో జయాపజయాలకు అతీతంగా విషయం వున్న దర్శకుడని ఎంతో మందికి వున్న నమ్మకం. ఆ నమ్మకం నిలబెట్టుకునేలా అమీతుమీ తీయడంలో ఇంద్రగంటి ఫెయిల్ అయ్యాడు. అప్పట్లో ma ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు అందరికీ కన్ఫ్యూజన్ కామెడీ అంటే ఇష్టపడేవాళ్లు. అదే ఐడియాతో దాదాపు 50 ఏళ్ల నుంచి తెలుగులో సినిమాలు వస్తున్నాయి.ఇప్పుడు కూడా అదే ఐడియాని కొత్త నటీనటులతో తీస్తే ఎలా ఉంటుందో అదే అమీతుమీ. ఒకరిని ఇంకోరని పొరబడడం,అందులో కామెడీ పండడం పాత ఫార్ములా. ఆ ఫార్ములాకి కనీసం కొత్త రంగులద్దే పని కూడా చేయలేదు ఇంద్రగంటి. అవసరాల, ఇషా, అడవి శేషు, వెన్నెల కిషోర్ అక్కడక్కడా మెరిసినా అసలు దాంట్లో మేటర్ లేకపోవడంతో అంతా తేలిపోయింది.
ప్లస్ పాయింట్స్ … ఉన్నంతలో అందరూ తెలుగు నటీనటులు, మంచి కెమెరా పనితనం మాత్రమే .
మైనస్ పాయింట్స్ … చెప్పుకుంటే ఇంకా చాలా వున్నాయి.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ … ప్రేక్షకులతో ” అమీతుమీ”
తెలుగుబుల్లెట్ రేటింగ్ … 2 .25 /5 .