బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి ప్రేమలో పడ్డారంట. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఆమె ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునేది.
రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఇరా నుపూర్‌తో ప్రేమ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాలనుకుందంట. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు.
ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. అంతేగాక తమ ప్రేమ విషయాన్ని తన తల్లి రీనా దత్తాకు చెప్పి, నుపూర్‌ను పరిచయం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కొద్ది రోజులు మహాబళేశ్వరంలోని ఆమిర్ ఫాంహౌజ్‌లో కలిసి ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫాంహౌజ్‌లో సన్నిహితులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్న ఫొటోలను నుపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నుపూర్, ఇరాలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అయితే ఇరా నాలుగేళ్లు మానసిక ఒత్తిడికి గురైనట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికి డిప్రెషన్‌కు చికిత్స కూడా తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇరా చెప్పింది.