బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం ‘జుండ్’. ఇందులో బిగ్‌బి ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతల పట్ల అమితాబ్ పెద్ద మనసు చాటుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలో నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు అమితాబ్ దృష్టికి వెళ్లిందట.
దీంతో ఆయన ఈ మూవీకి పారితోషికాన్ని తగ్గించమని మేకర్స్‌తో చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్యయంగా నిర్మాత సందీప్ సింగ్ ఓ ఇంటర్య్వూలో చెప్పడం విశేషం. ‘‘నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై వెచ్చించండి’’ అని అమితాబ్ తనతో అన్నట్లు సందీప్ సింగ్ తెలిపాడు. ఇది తెలిసి అమితాబ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్‌బి తన పారితోషికాన్ని తగ్గించడంతో మిగతా క్రూడ్, సిబ్బంది కూడా తమకు తమకు తక్కువ మొత్తం చెల్లిస్తే చాలని చెప్పడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారట.