అమృతకి ‘అదే’ కనపడిందా ?

Amrutha Special Story

అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టా మనుకుంటారు కొందరు. కాదు నాన్న పక్కన 10 నిముషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండు నిజాలే కానీ పురిటి నెప్పులు చూసిన వాళ్ళు మనిషి అవుతారు, పడక సుఖము చూసిన వాళ్లు పశువు అవుతారు. ఇది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రానా-నయనతార మెయిన్ లీడ్స్ గా వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో రానాతో నయనతార చెప్పే డైలాగ్. వినడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఇప్పుడు ఈ విష్యం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అంటే మిర్యాలగూడ ప్రేమ హత్య విషయంలో అన్న మాట.

maruthi-rao

అక్కడ జరిగింది ఏమయినా అయ్యుండచ్చు ఎందుకంటే వారి కుటుంబాల్లో పరిస్థితులు మనం ఇక్కడ కుర్చుని బేరీజు వేయలేం కదా ! సోషల్ మీడియాలో మాత్రం జనాలు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం ప్రణయ్ ను కులం వలెనే చంపారు అంటూ అతని హత్యను ఖండిస్తుండగా మరో వర్గం మాత్రం ఇది కులం వలన కాదు తండ్రికి తన కూతురి మీద ఉన్న ప్రేమ వలన అని ఇలా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు వ్యక్తిగత ఆరోపణలు సృష్టిస్తూ రెండు కుటుంబాల మీద ఆరోపణలు చేస్తూ నడిపిస్తున్నారు.

amrutha-social-media
ఈ నేపద్యంలో మొదటి నుండి అమ్రుతకి సపోర్ట్ గా ఉంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వారందరూ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నారు అందుకు రెండు కారణాలు ఒకటి మిర్యాలగూడ నడిబొడ్డున చనిపోయిన తన భర్త విగ్రహం కావాలని ఆమె పట్టుబడుతూ ఉండడం రెండవది ఆమె నిన్న ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాటలాడిన మాటలు. ఆమె వాదన ప్రకారం పిల్లల్ని పెంచడం కోసం పిల్లల్ని కంటారా ? వాళ్ళు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారట. శ్రీ మాన్ అమృత వర్షిని గారు ఈ విధంగా సెలవిచ్చారు మరి. ఈ ఒక్క స్టేట్మెంట్ కి నిన్నటిదాకా ఆమెకు సపోర్ట్ గా మాట్లాడిన వారంతా సోషల్ మీడియాలో తట్టా బుట్టా సర్దేసుకున్నారు. అంటే అమృత పశువు కాబట్టి ఆమెకు ఆ పది నిముషాల సుఖమే కనపడిందని కొందరు, అంటే నీకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా ఇలానే ఆలోచిస్తున్నావా అని మరి కొందరు ఆమెను ఇప్పుడు రివర్స్ కౌంటర్ మొదలుపెట్టారు.