సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. లీటర్ పాలపై రూ. 2 పెంచుతున్నట్టు ఆ సంస్ధ యాజమాన్యం తెలిపింది.దీంతో, పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
కాగా, అమూల్ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా.. అమూల్ సంస్థ చివరి సారిగా గతేడాది జూలైలో పాల ధరలను పెంచింది. మరోవైపు తమ కస్టమర్లకు అమూల్ సంస్థ ట‍్విట్టర్ వేదికగా శివరాత్రి శుభాకాంక్షలను తెలిపింది.