అమెరిక‌న్ సీరియ‌ల్ లో ఎమ్మీజాక్స‌న్

Amy jackson to do in american super girl tv serial

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌తీయ న‌టి మరొక‌రు హాలీవుడ్ బాట ప‌ట్టారు. అవ్వ‌టానికి బ్రిటిష్ దేశ‌స్థురాలే అయినా… భార‌తీయ సినిమాల‌తో హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఎమ్మీ జాక్స‌న్ అమెరికాలో ఓ టీవీ సీరియ‌ల్ లో న‌టించింది. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో న‌టించిన ఎమ్మీ జాక్స‌న్ అమెరిక‌న్ డ‌బ్ల్యు టీవీ సీరియ‌ల్ సూప‌ర్ గాళ్ లో న‌టించి హాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సీరియ‌ల్ వ‌చ్చే నెల తొమ్మిదో తేదీ నుంచి అమెరికాలో ప్ర‌సార‌మ‌వుతుంది. సీరియ‌ల్ లో ఎమ్మీ సాట‌ర్న్ గాళ్ పాత్ర‌లో న‌టించింది. ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ తో హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా కూడా క్వాంటికో… సీరియ‌ల్ తోనే హాలీవుడ్ లో గుర్తింపు పొందింది. ఆమెలానే… ఎమ్మీ కూడా సూప‌ర్ గాళ్ త‌ర్వాత హాలీవుడ్ లో బిజీ అయ్యే అవ‌కాశ‌ముంది. ఇంగ్లండ్ దేశ‌స్థురాలు కావ‌డం కూడా ఎమ్మీకి క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మీ త‌మిళ్ లో క్వీన్ తో పాటు ర‌జ‌నీకాంత్ 2.0లో న‌టిస్తోంది.