స్పైడర్‌ తమిళం మరియు మలయాళం పరిస్థితి ఇది…

spyder movie public talk in tamil and malayalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నేడు ‘స్పైడర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మంచి క్రేజ్‌ ఉన్న దర్శకుడు మురుగదాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్‌ చిత్రంగా నిలిచింది. ఏమాత్రం ఆకట్టుకోని కథనం, ఆకట్టుకోని దర్శకత్వంతో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్‌ మాత్రం సినిమా బాగుందని, ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది అంటూ చెబుతూ వస్తున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అని ఖరారు అయ్యింది.

మహేష్‌బాబు కెరీర్‌లో మొదటి సారి ఈ సినిమాను తమిళనాట అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. తమిళనాడుతో పాటు కేరళలో కూడా ఈ సినిమాను డబ్‌ చేశారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమా దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను రాబడుతుందని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు తీవ్రంగా షాక్‌ తలిగింది. తెలుగులో ఇప్పటికే నెగటివ్‌టాక్‌తో కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. ఇక తమిళంలో పరిస్థితికి వస్తే అక్కడ ముందు నుండే ఈ సినిమాపై ఆసక్తి లేదు. దర్శకుడు మురుగదాస్‌ అక్కడ స్టార్‌ అయినప్పటికి మహేష్‌బాబుకు అక్కడ అంత సీన్‌ లేదు. మహేష్‌బాబు సినిమాపై వారు ఆశలు పెట్టుకోలేదు. కాని సినిమా బాగుంటే మురుగదాస్‌ కోసం అయినా సినిమాను చూస్తాను అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా తమిళనాట కూడా సినిమాకు బ్యాడ్‌ టాక్‌ వచ్చింది.

తమిళంతో పాటు మలయాళంలో కూడా సినిమా ఫ్లాప్‌ అంటూ టాక్‌ వచ్చింది. ఈ చిత్రం మూడు భాషల్లో విడుదల కాగా మూడు భాషల్లో కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. తమిళ డబ్బింగ్‌ హక్కులను భారీ మొత్తంకు ఒక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. కాని ఇప్పుడు కనీసం ప్రమోషన్‌ ఖర్చులు అయినా వచ్చే పరిస్థితి లేదు అని త పట్టుకున్నాడు. మలయాళంలో కూడా పరిస్థితి అదే. అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఘోర నష్టాలు తప్పవని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.