నితిన్ “రాబిన్‌హుడ్‌” పై అదిరిపోయే అప్డేట్!

An exciting update on Nitin's “Robinhood”!
An exciting update on Nitin's “Robinhood”!

టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్‌ (Robinhood). ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ కి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చిత్ర యూనిట్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో నైట్ టైమ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తుంది .

An exciting update on Nitin's “Robinhood”!
An exciting update on Nitin’s “Robinhood”!

యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ మూవీ కి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.